The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా సెప్టెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక ప్రీమియర్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ ఆదివారం అధికారిక మెమో జారీ చేశారు. సినిమా నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం.. విడుదలకు ఒకరోజు ముందే ప్రీమియర్ షో నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 23న సాయంత్రం 6:30 గంటలకు ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి లభించింది. ఈ షోకు జీఎస్టీతో కలిపి ఒక్కో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. అదే విధంగా సెప్టెంబర్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించారు.
‘ది ప్యారడైజ్’ విడుదల నేపథ్యంలో తొలి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలకు అదనపు చార్జీలు వర్తించనున్నాయి. మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు టికెట్‌పై రూ.95 అదనపు చార్జీ వసూలు చేయనున్నారు. అలాగే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు రూ.45 అదనపు చార్జీ చేయనున్నారు. సింగిల్ స్క్రీన్స్ విషయానికి వస్తే సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు టికెట్‌పై రూ.48 అదనపు చార్జీ కాగా, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు రూ.23 అదనపు చార్జీ చేయనున్నారు. ఈ అదనపు మొత్తాల్లో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది. టికెట్ ధరల పెంపునకు అనుమతితో పాటు ప్రభుత్వం చిత్ర నిర్మాతలకు ఓ కీలక షరతు విధించింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీకి నిర్మాతలు తప్పనిసరిగా రూ.1 కోటి విరాళం అందించాలని ఆదేశించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఈ నిధులను సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
సినిమా ప్రదర్శన సమయంలో డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనలు థియేటర్లలో కచ్చితంగా అమలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత లైసెన్సింగ్ అధికారులకు హోంశాఖ సూచించింది. ఇక నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు మరో 4 రోజులే ఉండటంతో.. ప్రీమియర్ షో, పెరిగిన టికెట్ ధరలు, రోజుకు ఐదు షోల అనుమతితో థియేట్రికల్ రిలీజ్ మరింత ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!