AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి AAS
- SGPతో ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం
- 1.30 లక్షల మందికి నేరుగా లబ్ధి
- సర్వీస్ రికార్డుల పరిశీలనకు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAS SGP : ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆరేళ్ల సర్వీసును విజయవంతంగా పూర్తి చేసుకున్న సిబ్బందికి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (AAS) కింద స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్ (SGP) మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది.
1.30 లక్షల మంది ఉద్యోగులకు నేరుగా లబ్ధి
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000కు పైగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో విధినిర్వహణలో ఉన్న సుమారు 1.30 లక్షల మంది ఉద్యోగులకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా 2019, 2020 సంవత్సరాల్లో తొలి విడత రిక్రూట్మెంట్లో ఎంపికై బాధ్యతలు స్వీకరించిన సిబ్బందికి ఈ స్కేల్ వర్తిస్తుంది. 11వ వేతన సవరణ కమిషన్ (PRC) చేసిన సూచనలకు అనుగుణంగానే ప్రభుత్వం ఈ ఆర్థిక లబ్ధిని అమల్లోకి తెచ్చింది.
Also Read
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
హోదా పెంపు కాదు.. కేవలం ఆర్థిక భరోసా మాత్రమే
కాగా, ఇది రెగ్యులర్ ప్రమోషన్ కాదని, సుదీర్ఘకాలంగా ఒకే పోస్టులో సేవలు అందిస్తున్న ఉద్యోగులకు లభించే ఆర్థిక ఊరట మాత్రమేనని అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్‌లో భాగమైన ఈ వ్యవస్థ ద్వారా 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి స్పెషల్ గ్రేడ్ అందిస్తుండగా, ఆ తర్వాత వరుసగా 12, 18, , 24 ఏళ్ల సర్వీసును అధిగమించిన కొద్దీ తదుపరి స్థాయి ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయని వివరించారు.
రికార్డుల పరిశీలనకు ఆదేశాలు.. సర్వత్రా హర్షాతిరేకాలు
తాజా జీవో నేపథ్యంలో, సచివాలయాల్లో అర్హులైన ఉద్యోగుల సర్వీస్ రికార్డులను తక్షణమే క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎలాంటి ఆలస్యం లేకుండా స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్‌ను వర్తింపజేయాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆర్థికంగా ఎంతో ఊరటనిచ్చే ఈ నిర్ణయం పట్ల సచివాలయ ఉద్యోగులు, వారి సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!