MLA MS Raju: బాలయ్య అభిమానిగా చెబుతున్నా.. ఆయన జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా..! ఎమ్మెల్యే మాస్ వార్నింగ్..
- బాలకృష్ణ జోలికి వస్తే.. చర్మం ఒలిచేస్తాం..
- మాస్ వార్నింగ్ ఇచ్చిన మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు..
- నేను బాలయ్య అభిమానిగా చెబుతున్నా అంటూ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA MS Raju: తెలుగుదేశం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ జోలికి వస్తే.. చర్మం ఒలిచేస్తాం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు.. నేను బాలయ్య అభిమానిగా చెబుతున్నా అంటూ హెచ్చరించారు.. హిందూపురంలో కొందరు చిల్లర వెధవలు బాలయ్య గురించి మాట్లాడరు… దీంతో, మా వాళ్లు ఆవేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని పేర్కొన్నారు.. అంతేకానీ, బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తాం.. మీకు, మీ అధినేత కూడా ఇదే మా హెచ్చరిక అంటూ హాట్ కామెంట్లు చేశారు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు..
Read Also: NBK : బాలయ్యకు తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎస్ CV ఆనంద్ క్షమాపణలు
Also Read
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
కాగా, సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం విదితమే.. హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.. హిందూపురం వైసీపీ ఇంఛార్జ్ దీపిక రెడ్డి భర్త వేణు రెడ్డి ఆఫీసు మీద కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఉద్దేశిస్తూ వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు వాళ్లకు ఆగ్రహం తెప్పించాయి.. ఈ నేపథ్యంలోనే.. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు..
Read Also: Supreme Court: నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ.. తీర్పుపై ఉత్కంఠ! .
మరోవైపు, శ్రీ సత్యసాయి హిందూపురం నియోజకర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారు.. 2024 పార్టీ ఎన్నికల్లో పార్టీ విజయం.. ఒక కొత్త ఉత్సాహన్ని ఇచ్చింది.. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉంటుంది.. భవిష్యత్తులో మరో పార్టీ రాష్ట్రంలో టీడీపీతో తలపడలేదు అని వ్యాఖ్యానించారు.. ఇక, ఎన్టీఆర్ కొడుకుగా నాకు హిందూపురంలో మొదటిసారి అవకాశం ఇచ్చారు.. ఆ తర్వాత నేను చేసిన అభివృద్ధి కారణంగానే మూడు సార్లు గెలిచాను.. ఎన్టీఆర్ కొడుకు అంటే ఒక్కసారి మాత్రమే ఆదరిస్తారు.. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేశాను కాబట్టే ఈ విజయం సాధ్యమైందన్నారు..సినిమాలంటే అరవడం, నవ్వడం, ఏడవడం కాదు.. సినిమాలో ఒక పాత్ర చేయడం అంటే ఒక ఆత్మలోకి ప్రవేశించడమే అన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?