Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- పాకిస్తాన్లో కీలక రాజకీయ పరిణామాలు..
- ఓ వైపు ఇమ్రాన్ ఖాన్‌కు ఆరోగ్య పరీక్షలు..
- మరోవైపు ఆయన సోదరి అరెస్ట్, జైలు తరలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో కీలక పరిణామాలు ఎదురవుతున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. ఇదిలా ఉంటే, ఆయన సోదరి అలీమా ఖాన్‌ను లాహోర్‌లో పోలీసులు అరెస్ట్ చేసి, కోట్ లఖ్‌పత్ జైలుకు తరలించడం సంచలనంగా మారింది.
అడియాలా జైలులో ఉన్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)కు చెందిన వైద్యులు అనేక పరీక్షలు నిర్వహించారు. కంటి వైద్య బృందం, ఇతర వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఇమ్రాన్ ఖాన్‌కు వివిధ పరీక్షలు నిర్వహించినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. బీపీ, కొలెస్ట్రాల్, కంటిచూపుతో పాటు ఇతర ఆరోగ్య అంశాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు, కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ పరీక్షలు జరిగాయి.
Also Read
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- US News: 19 ఏళ్ల యువకుడికి "హిందుత్వం"పై ఇంత ద్వేషమెందుకు?
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్‌ను లాహోర్‌లోని ఆమె నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 27న పీటీఐ కార్యకర్తలు ఇస్లామాబాద్ మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీకి పిలుపునిచ్చారు. లాహోర్ జిల్లా యంత్రాంగం ఆమెను 30 రోజుల పాటు నిర్బంధించే ఉత్తర్వుల్ని జారీ చేసింది. ప్రజాభద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్నందున ఈ అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. 1960 నాటి చట్టంలోని నిబంధనల ప్రకారం, ఆమెను అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!