Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kayadu Lohar: గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే తారల వెనుక ఎవరికీ తెలియని ఎన్నో కన్నీటి కథలు, కఠినమైన పోరాటాలు దాగి ఉంటాయి. అందం, అమాయకత్వంతో కుర్రకారు మనసుల్ని కొల్లగొడుతూ సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది యంగ్ బ్యూటీ కయాదు లోహర్. త్వరలోనే న్యాచురల్ స్టార్ నాని సరసన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మరాఠీ భామ, వెండితెరకు రాకముందు తాను పడ్డ కష్టాలను గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన గతం గురించి నిర్మొహమాటంగా మాట్లాడిన కయాదు లోహర్, తన ప్రయాణం పూలపాన్పు కాదని స్పష్టం చేసింది. “మా మూలాలు అసోంలో ఉన్నప్పటికీ, నేను పుట్టి పెరిగిందంతా పుణెలోనే. చిన్నప్పటి నుంచి చదువు అంతంత మాత్రమే అబ్బేది. కానీ నాటకాలు, స్టేజ్ పెర్ఫార్మెన్స్లు, డ్యాన్స్ అంటే చెప్పలేనంత ప్రాణం ఉండేది. మాది చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. కుటుంబానికి ఆసరాగా నిలవడం కోసం చిన్న వయసు నుంచే చిన్నచిన్న పనులు చేయడం మొదలుపెట్టాను. ఒకానొక దశలో కాఫీ షాపులో టీలు అందించే పనిచేశాను. ఆ తర్వాత బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా కూడా పనిచేశాను” అంటూ గతాన్ని పంచుకుంది.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తన కాళ్లపై తాను నిలబడేందుకు ఒక దశలో ఐటీ ఉద్యోగంలో కూడా చేరినట్లు ఆమె గుర్తుచేసుకుంది. అయితే అక్కడి తీవ్రమైన పని ఒత్తిడిని భరించలేక, తన ఆలోచనలకు ఆ ఉద్యోగం సరిపడక ఒకరోజు ఆఫీసులోనే తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేశానని చెప్పింది. ఆ తర్వాత తన కల అయిన కళారంగం వైపే అడుగులు వేసి, మోడలింగ్ నుంచి ఒక్కో మెట్టూ ఎక్కుతూ సినీ రంగంలోకి ప్రవేశించినట్లు చెప్పారు. సాధారణ సేల్స్ గర్ల్ స్థాయి నుంచి మొదలై, నేడు టాలీవుడ్ స్టార్ హీరో నాని సరసన పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా ఎదిగారు కయాదు లోహర్. ఎన్నో అడ్డంకులను దాటుకుని తన స్వశక్తితో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదుగుతున్న ఈ బ్యూటీ జీవిత ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!