Vijay Sethupathi: టాలీవుడ్ డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాధ్ తమిళ విలక్షణ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi)తో మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభం అయ్యింది. తాజాగా సంక్రాంతి పండుగ సందర్బంగా ఈ క్రేజీ సినిమా నుంచి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను మేకర్స్ విడుదల చేశారు.
Read Also: Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. నెక్ట్స్ ఏంటంటే..!
అయితే, ఈ సినిమాకు స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే డిఫరెంట్ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక, ఈ పోస్టర్ లో విజయ్ సేతుపతి చేతిలో కత్తితో కనిపించాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ మూవీలో విజయ్ ఓ బిచ్చగాడి పాత్రను పోషిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: Fastag Rules: వాహనదారులకు అలర్ట్.. ఇకపై అలా కుదరదు..!
ఇక, ఎక్స్ వేదికగా హీరోయన్ చార్మి కౌర్ ఓ పోస్ట్ పెట్టారు. అందులో మక్కల్ సెల్వన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మీ అంకితభావాన్ని దగ్గరగా చూడటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీగా ఉంటారని తెలిపింది. #SLUMDOG – 33 టెంపుల్ రోడ్ మనందరికీ ఒక చిరస్మరణీయ ప్రాజెక్ట్ అవుతుంది అని చార్మి వెల్లడించింది.
Happy Birthday to the one and only Makkalselvan @VijaySethuOffl sir 🤗
It’s always a pleasure to witness your dedication and simplicity up close. You bring so much sincerity and soul into every space you enter 🙏🏻#SLUMDOG – 33 Temple Road will be a memorable project for all us… pic.twitter.com/wxhzeVyn3T
— Charmme Kaur (@Charmmeofficial) January 16, 2026