తెలుగు సినిమా ప్రేక్షకులకు పూరి జగన్నాథ్ పేరు వింటేనే ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఆయన సినిమాల్లో ఉండే మాస్ యాక్షన్, పంచ్ డైలాగులు, హీరో ఎంట్రీలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. అయితే గత కొన్నేళ్లుగా పూరి దర్శకత్వం వహించిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి చిత్రాలు నిరాశ కలిగించాయి. ఈ నేపథ్యంలో పూరి తన తదుపరి ప్రాజెక్ట్ “బెగ్గర్” కోసం మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా విజయ్ సేతుపతిని తీసుకోవడం తోనే అంచనాలు హైపయ్యాయి. ఎందుకంటే విజయ్ సేతుపతి లాంటి వెర్సటైల్ నటుడు పూరి మాస్ స్టైల్‌లో కనిపించబోతున్నాడంటే ఆ ఆసక్తి మామూలుగా ఉండదు.
Also Read : Ranbir Kapoor : మొన్న తల్లి.. నేడు తండ్రి! కూతురి కోసం ఊహించని త్యాగం చేసిన రణ్‌బీర్ కపూర్
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకొచ్చింది. విజయ్ సేతుపతి ఎంట్రీ సీక్వెన్స్ కోసం పూరి ఒక భారీ సెట్‌ను వేశాడని సమాచారం. ఈ సీక్వెన్స్ హీరోను అద్భుతంగా ప్రెజెంట్ చేయడానికి పూరి ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. ఇంతకుముందు ఆయన సినిమాల్లో హీరోల ఎంట్రీలు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా ఉండేవి. అలాంటి ఎంట్రీ సీక్వెన్స్ ఈసారి విజయ్ సేతుపతికి ప్లాన్ కావడం అభిమానుల్లో హైప్‌ను రెట్టింపు చేస్తోంది. అంతేకాదు, ఈ ఎంట్రీలో కేవలం హీరో మాత్రమే కాకుండా మిగిలిన ప్రధాన తారాగణం కూడా కనిపిస్తారట. ఇక సేతుపతి కూడా తను ఎలాంటి పాత్రలో కనిపించినా దానికి ప్రత్యేకమైన నైజాన్ని తీసుకువస్తాడు. ఆయన యాక్టింగ్, పూరి స్టైల్ డైరెక్షన్ కలిస్తే ఎలాంటి మాస్ మాంత్రికం కనబరుస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.