బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ చలాకీగా, పార్టీలు, డేటింగ్ లతో గాసిప్స్‌లో ఉండే ఈ హీరో.. ఇప్పుడు మాత్రం పూర్తి భిన్నంగా మారిపోయాడు. ఒకప్పటి వరకు ఆయనకు బ్యాడ్ బాయ్, ప్లే బాయ్ అనే ట్యాగ్‌లు తప్పవు. కానీ పెళ్లి తరువాత, ముఖ్యంగా కూతురు రహా పుట్టిన తర్వాత రణ్‌బీర్ జీవితం మొత్తానికే కొత్త మలుపు తిరిగింది.
Also Read : Bigg Boss 9 : ఆ అల్లరి పిల్ల వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌస్‌లో మజా డబుల్ అవుతుందా?
ఇటీవల ‘యానిమల్’ లో క్రూరమైన పాత్రలో మెప్పించిన రణ్‌బీర్, ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీ “రామాయణ”లో రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా రణ్‌బీర్ ఇప్పుడు తన షెడ్యూల్‌ను తగ్గించుకుని, ఎక్కువ సమయం భార్య ఆలియా, కూతురు రహాతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అతని ఈ మార్పు వెనుక అసలు కారణం కూతురు రహానే. తాజా సమాచారం ప్రకారం రణ్‌బీర్ తన బేబీతో ఎక్కువ టైం గడపాలనే ఉద్దేశ్యంతో పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. మందు, సిగరెట్ పూర్తిగా మానేశాడు. ఇది కేవలం తన ఆరోగ్యానికే కాకుండా, తన కూతురు భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి అలవాట్లు మానేయడం కష్టం. కానీ రణ్‌బీర్ మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిని వదిలేశాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఒకప్పుడు ఎప్పుడూ పార్టీల్లో, పబ్‌ల్లో కనిపించే రణ్‌బీర్.. ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్‌గా మారిపోయాడు. తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చే క్రమంలో తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయమని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ కొత్తగా రాముడి పాత్రలో మెప్పించబోతుండగా, రియల్ లైఫ్‌లోనూ తన కూతురి కోసం చేసిన త్యాగంతో “ఆదర్శ తండ్రి” గా నిలుస్తున్నాడు.