కన్నడ బ్యూటీ ప్రియాంక మోహన్ గురించి పరిచయం అక్కర్లేదు.‘ఓంధ్ కథే హెల్లా’ మూవీతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. 2019లో ‘నాని గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు అభిమానులను పలకరించింది. తర్వాత ‘శ్రీకారం’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ అనంతరం తనకు ఇక్కడ ఎలాంటి ఆఫర్‌లు రాకపొవడంతో కోలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలతో బిజీ గా ఉన్న ఈ అమ్మడు తెలుగులో పవర్ స్టార్ సరసన ‘ఓజి’ మూవీ కూడా చేస్తుంది.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో ‘OG’ ఒకటి. సాహో ఫేమ్ సుజిత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీని పాన్ ఇండియా చిత్రంగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ ప్రతినాయక పాత్ర పోషిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక మోహన్ ఈ మూవీకి సంబంధించి తన అనుభూతిని పంచుకుంది..‘ ‘OG’ మూవీ షూటింగ్‌లో ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.పవన్ లాంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల. మొత్తానికి అది నెరవేరింది. ఈ మూవీలో మీరు పవన్ కళ్యాన్‌ని ఒక కొత్త తరహాలో చూస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. ఇక ఈ కామెంట్స్ పవన్ ఫ్యాన్స్‌లో మరింత ఊత్సహాని నింపింది.