యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి తో సూపర్ హిట్ కొట్టినసంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా కల్కి రూ. 1100 కోట్లు కలెక్ట్ చేసింది ఆ జోష్ లోనే మారుతీ దర్శకత్వంలో రాజసాబ్ అనే సినిమాను స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లో డార్లింగ్ బిజీబిజీగా ఉన్నాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. థమన్ సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది రాజసాబ్.
Also Read : Pushpa2 : ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?
ఇదిలా ఉండగా అందాల రాక్షసి, సీతారామం వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన హను రాఘవ పూడి తో “ఫౌజి” (Fauji) అనే సినిమా చేస్తున్నాడు. స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా చిత్రంగా రానుంది. ఈచిత్రం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యుల్ చేశారు. ప్రభాస్ లేని సీన్స్ తీస్తున్నారు. కాగా ఈ నెల 15 నుండి రెండో షెడ్యుల్ రెండో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో కూడా ప్రభాస్ జాయిన్ అవ్వట్లేదని తెలుస్తోంది. మిగిలిన నటీనటులతో వచ్చే సీన్స్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు హను. అయితే డిసెంబర్ నుండి షూట్ లో జాయిన్ అవ్వనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు సాంగ్స్ కంప్లీట్ చేసి ఇచ్చేశారు సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్. ఆ రెండు చాలా బాగా వచ్చాయని విశాల్ వర్క్ పట్ల హాని చాలా హ్యాపీ ఉన్నాడని యూనిట్ టాక్.