యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి తో సూపర్ హిట్ కొట్టినసంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా కల్కి రూ. 1100 కోట్లు కలెక్ట్ చేసింది ఆ జోష్ లోనే మారుతీ దర్శకత్వంలో రాజసాబ్ అనే సినిమాను స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లో డార్లింగ్ బిజీబిజీగా ఉన్నాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. థమన్ సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది…
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ బర్త్ డే అంటే సెలబ్రేషన్స్ ఆకాశాన్నంటేలా ఉంటాయి. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే, ఆ రోజు రావడానికి ఇంకా పది రోజుల సమయం ఉంది కానీ ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రభాస్ బర్త్ డేకి ఇంకా సమయం ఉన్నా కూడా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ… సలార్, కల్కి, ప్రభాస్ ట్యాగ్స్ ని…