ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో టాప్‌లో మెరిసిన పూజా హెగ్డే, ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో తిరిగి రావాలని తీవ్రంగా కృషి చేస్తోంది. వరుస ప్లాపులు కారణంగా కొంతకాలంగా తెలుగు తెరపై కనిపించని ఆమెకు, ఇప్పుడు ఓ భారీ ఛాన్స్ లభించింది. తెలుగులో చివరిగా ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్’ సినిమాల్లో నటించిన పూజా, రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా ఫెయిల్ కావడంతో టాలీవుడ్ నుంచి దూరమైంది. హిందీ, తమిళం వంటి భాషల్లో అదృష్టాన్ని పరీక్షించు కున్నప్పటికీ అక్కడ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే.. ఇప్పుడు టాలీవుడ్‌కి స్ట్రాంగ్‌రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
Also Read : Shreya Dhanwanthary : ముద్దు సన్నివేశం తొలగించడమేంటీ..? సెన్సార్‌పై శ్రీయ బోల్డ్ కౌంటర్
తాజా సమాచారం ప్రకారం, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోయే స్ట్రైట్ తెలుగు ఫిల్మ్‌లో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూజా హెగ్డేతో అన్ని చర్చలు పూర్తయ్యాయని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త దర్శకుడు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. దుల్కర్ – పూజా కాంబోపై మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.