టాలీవుడ్‌లో వరుస విజయాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్, ప్రస్తుతం రవి నెలకుడితి దర్శకత్వంలో ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌తో చాలాకాలం తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నది గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే. ఇటీవలి సంవత్సరాలలో బాలీవుడ్ ప్రాజెక్టులపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ, తెలుగులో సినిమాలు తగ్గించారు. ముఖ్యంగా ఆమె భారీ పారితోషికం కారణంగానే టాలీవుడ్‌కు దూరమయ్యారని అప్పట్లో ఓ టాక్…
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో టాప్‌లో మెరిసిన పూజా హెగ్డే, ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో తిరిగి రావాలని తీవ్రంగా కృషి చేస్తోంది. వరుస ప్లాపులు కారణంగా కొంతకాలంగా తెలుగు తెరపై కనిపించని ఆమెకు, ఇప్పుడు ఓ భారీ ఛాన్స్ లభించింది. తెలుగులో చివరిగా ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్’ సినిమాల్లో నటించిన పూజా, రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా ఫెయిల్ కావడంతో టాలీవుడ్ నుంచి దూరమైంది. హిందీ, తమిళం వంటి భాషల్లో అదృష్టాన్ని పరీక్షించు కున్నప్పటికీ…