అక్కినేని ‘నాగచైతన్య’ ఫస్ట్ మూవీ ‘జోష్’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నటి శ్రీయ ధన్వంతరి . చైతన్య క్లాస్ మేట్ గా భావన అనే క్యారెక్టర్ ద్వారా మంచి గుర్తింపు పొందిన శ్రీయ, ఆ తర్వాత హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసి ‘వై చీట్ ఇండియా, చుప్, అద్భుత్ వంటి పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ లో .. స్కిన్ షో కు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అయితే..
Also Read : Chiranjeevi : అనిల్ రావిపూడి సినిమాలో మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ రోల్..!
తాజాగా వరల్డ్ వైడ్ గా ‘సూపర్ మాన్’ మూవీ రిలీజైన విషయం తెలిసిందే. ఇండియా వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో విడుదల కాగా, ఇండియా వెర్షన్‌కి సంబంధించి హీరో హీరోయిన్ పై తెరకెక్కిన ముప్పై మూడు సెకన్ల నిడివి ఉన్న ముద్దు సిన్స్ సెన్సార్ వాళ్ళు తొలగించడం జరిగింది. ఈ విషయం పై శ్రీయ ఇన్‌స్టా వేదికగా స్పందిస్తు ‘ముద్దు సన్నివేశాన్ని తొలగించడం నిజంగా ఆశ్చర్యకరం. థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులకు పూర్తి అనుభూతి ఇవ్వాలని మనం ఆశిస్తాం. కానీ, ఇలాంటి సన్నివేశాలు తీసేస్తే అనుభవం అసంపూర్ణంగా ఉంటుంది. మా డబ్బు ,మా సమయంతో మేము ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్నే నిర్ణయించుకోనివ్వండి. ప్రేక్షకుల్ని చిన్నపిల్లలాగా సెన్సార్ వాళ్ళు భావిస్తున్నారు’ అంటూ సూటిగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు శ్రీయ.