ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్‌ల కెరీర్ కాలం తక్కువగా ఉంటుంది. ఒకవేళ వరుసగా ఫ్లాఫులు పలకరిస్తే కనుక కథానాయికల కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రజంట్ ఇలాంటి సరిస్థితిలోనే ఉంది పూజా హెగ్డే. గత మూడేళ్లుగా ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఇటీవల వచ్చిన ‘రెట్రో’ సైతం డిజాస్టర్‌గా నిలిచింది. వరుస ఫ్లాఫ్‌లు పడుతున్న కూడా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తున్న పూజాహెగ్డే.. తాజాగా ‘ కెరీర్‌లో ఇదొక బ్యాడ్‌ఫేజ్, కాస్త ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని విశ్వాసంతో ఉన్నాను. జీవితం సాఫీగా సాగితే అది జీవితం ఎందుకు అవుతుంది. కానీ బాధగా ఉన్న కొన్ని తట్టుకోవాలి తప్పదు’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్నవన్నీ భారీ చిత్రాలే.
Also Read: Coolie : తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ’ రైట్స్ కోసం భారీ డిమాండ్..!
కోలివెడ్ స్టార్ హీరో రజనీకాంత్ ‘కూలీ’లో అతిథి పాత్రలో కనిపించనుంది. అలాగే దళపతి విజయ్‌తో కలిసి ‘జన నాయగన్’ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ అమ్మడు.. దీనితో పాటు తమిళంలో ‘కాంచన-4’లో నాయికగా నటిస్తున్నది. ఆ ప్రాజెక్ట్‌పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరి ఈ సినిమాలతో అయిన పూజ కెరీర్ గాడిలో పడుతుందేమో చూడాలి..