పవణ్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండగా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక పూర్తి హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, రెండు పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోగా. తాజాగా..
Also Read : Taapsee Pannu : ‘ముల్క్’ మూవీ సీక్వెల్‌ను మొదలెట్టిన తాప్సీ..!
మూవీ రిలీజ్ టైమ్ దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి మూడో పాటను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్‌గా ‘అసరుల హననం’ అనే పాటను మే 21న ఉదయం 11.55 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతే కాదు ఈ ప్రకటనలో భాగంగా ఓ సాలిడ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.