దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమైంది, అయితే అనుకోకుండా ఆ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు. తర్వాత ఆయన స్థానంలో నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమాను పూర్తి చేశారు. అయితే తాజాగా, ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, “మీరు మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఆలస్యం కావడానికి కారణమేంటి? మీరు దర్శకుడుగా తప్పుకోవడానికి కారణమేంటి?”…
Krish : హరిహర వీరమల్లు సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు. అయితే సినిమా ఆలస్యం అవుతూ ఉన్న కారణంగా ఆయన తప్పుకోవడంతో ఆయన స్థానంలో సినిమా నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అయితే క్రిష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ఘాటి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా క్రిష్ అండ్ టీం మీడియా…
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జులై 24న థియేటర్లలోకి వచ్చింది. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే సినిమా ఓటీటీ డేట్ ను తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. మూవీని అమేజాన్ ప్రైమ్ లో ఆగస్టు 20 నుంచి అంటే రేపటి నుంచే స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు మూవీ టీమ్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీ కోసం…
హరిహర వీరమల్లు సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణ ఆ సినిమాలో త్రివిక్రమ్ ప్రమేయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజానికి సినిమా ఆగిపోయిన తర్వాత మళ్లీ సినిమా మొదలు పెట్టాల్సిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారని, తనకు త్రివిక్రమ్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని అన్నారు. తాను అనుకున్న లైన్ తీసుకువెళ్లి త్రివిక్రమ్‌కి చెప్పగా అది ఆయనకు నచ్చిందని, వెంటనే పవన్ కళ్యాణ్‌కి జ్యోతి కృష్ణ రెడీగా ఉన్నాడు, సినిమా చేయవచ్చని చెప్పినట్లు వెల్లడించారు. పవన్…
HHVM : పవన్ కల్యాణ్ యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు మూవీ థియేటర్లలో ఆడుతోంది. ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ కోసం పవన్ వరుసగా ప్రమోషన్లు చేశాడు. ప్రస్తుతం ట్రిమ్ చేసిన కంటెంట్ థియేటర్లలో రిలీజ్ చేశారు. టికెట్ రేట్లు కూడా తగ్గించారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ జ్యోతికృష్ణ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో సెకండ్ పార్ట్ పై క్లారిటీ ఇచ్చారు. మేం ఈ మూవీ అనుకున్నప్పుడు ఒక్కటే పార్ట్ ఉండేది.…
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. మూవీ ప్రమోషన్లలో డైరెక్టర్ జ్యోతికృష్ణ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘హరిహర వీరమల్లు కథను క్రిష్ రాసుకున్నప్పుడు కోహినూర్ డైమండ్ దొంగిలించే ఓ కామెడీ మూవీగా తీయాలనుకున్నారు. మేం కూడా ముందు అదే అనుకుని స్టార్ట్ చేశాం. ఈ విషయం ఇన్ని రోజులు కావాలనే దాచిపెట్టాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి దీన్ని చెప్పొచ్చు.…
HHVM : హరిహర వీరమల్లు మూవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. పవన్ కల్యాణ్ నటించిన ఈ మూవీని క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మూవీ రిలీజ్ అయిన తర్వాత జ్యోతికృష్ణ వరుసగా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన వీరమల్లు పాత్ర గురించి స్పందించాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్రను వేదాలను, పురాణాలను బేస్ చేసుకుని డిజైన్ చేశాం. మొఘల్ చక్రవర్తులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నప్పుడు వేదాలు చదువుకున్న వీరమల్లు ఒక…
హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ సంపాదించింది. పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని క్రిష్ డైరెక్షన్‌లో మొదలుపెట్టారు. అయితే సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆయన తప్పుకోవడంతో, ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అయితే సినిమా కథ విషయంలో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయని ప్రచారం నేపథ్యంలో ఆయన స్పందించారు. Also Read : Jyothi Krishna:…
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. వాస్తవానికి ఆ రోజు రిలీజ్ అయిన ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాని ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదని, సెకండ్ హాఫ్ విషయంలోనే కంప్లైంట్స్ ఉన్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే వీఎఫ్‌ఎక్స్ అయితే చాలా నాసిరకంగా…
దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవనం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వివిధ రంగాల్లో విధులు నిర్వహిస్తున్న తెలుగు వారి కోసం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని ఏపీ భవన్లో రెండు రోజుల పాటు ప్రదర్శిస్తున్నారు. ఈ పాన్-ఇండియా చిత్రం జూలై 24, 2025న విడుదలై, భారీ ఓపెనింగ్స్‌తో పాటు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలను అందుకుంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు…