Old Woman Fainted in a Shop Opening by Anupama Parameswaran: స్టార్ హీరోలు స్టార్ హీరోయిన్ల చేత వ్యాపార సంస్థలను ప్రారంభించే ట్రెండ్ ఇప్పుడు బాగా ఎక్కువైంది. ఇలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి డబ్బులు కూడా దండిగానే వస్తూ ఉండడంతో హీరోయిన్లు ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలకి హాజరవుతున్నారు. తాజాగా అలా వెళ్ళిన అనుపమ పరమేశ్వరన్ కారణంగా ఒక వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయిన ఘటన చోటు చేసుకుంది. అసలు విషయం ఏమిటంటే పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో చెన్నై షాపింగ్ మాల్ కి సంబంధించిన కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ జరిగింది. ఈ బ్రాంచ్ ఓపెనింగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేతుల మీదుగా జరిగింది. పిడుగురాళ్లకు అనుపమ పరమేశ్వరన్ వస్తుందనే విషయం తెలిసి ఆమెను చూసేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన జనం కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
Kumaradevam Cinema Tree: తూ.గో జిల్లా సినిమా చెట్టుకు జీవం పోయడానికి ఏపీ సర్కార్ యత్నాలు
ఒకరకంగా ఆమెన్ చూసేందుకు ఆ కార్యక్రమానికి హాజరైన జనం అంతా ఎగబడ్డారు. దీంతో ఆ క్రౌడ్ లో ఉన్న ఒక వృద్ధురాలు పడిపోయిన ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించి ఆ తర్వాత సపర్యలు చేశారు. ఇక ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం అయితే బాగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. చివరిగా ఆమె తెలుగులో టిల్లు స్క్వేర్ అనే సినిమాలో లిల్లీ జోసెఫ్ అనే ఒక నెగటివ్ రోల్ లో కనిపించింది. ఇక ప్రస్తుతానికి ఆమెకు తెలుగులో ఒకే ఒక్క సినిమా ఉంది. పరదా అనే సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. అయితే మలయాళంలో రెండు సినిమాలు, తమిళంలో రెండు సినిమాలు ఆమె చేతుల్లో ఉన్నాయి. అవి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి తెలుగులో మరో సినిమాను సైన్ చేయాల్సి ఉంది.