AP Government to revive Kumaradevam Cinema Tree: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం అనే ఒక గ్రామ గోదావరి తీరంలో ఉన్న ఒక చెట్టు గోదావరి వరదల కారణంగా కుప్పకూలిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ చెట్టు కేంద్రంగా సుమారు 300 సినిమాలను షూటింగ్ జరిపారు. అంటే 300 సినిమాల్లో ఈ చెట్టు కనిపించింది అన్నమాట. అలాంటి చెట్టు గోదావరి వరదల కారణంగా నేలకు ఒరగడంతో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఆ గ్రామం వాసులైతే బాధపడ్డారు. తెలుగు సినీ ప్రేమికుల సైతం అయ్యో అనుకున్నారు. అయితే ఇప్పుడు నేలకూలిన సినిమా చెట్టుకు జీవం పోయడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టి సినిమా చెట్టు చిగురింప చేయటానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.
Saripodhaa Sanivaaram: నాని సినిమా లైన్ లీక్.. ఆ బ్లాక్ బస్టర్ కథతోనే?
300 సినిమాలు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా చెట్టు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు అధికారులు. అందులో భాగంగా నేలకొరిగిన సినిమా చెట్టును పరిశీలించిన కలెక్టర్ పి. ప్రశాంతి మళ్లీ సినిమాలు చిత్రీకరణకు అణువుగా సినిమా చెట్టుకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆమె ఆదేశాలతో త్వరలోనే అధికార యంత్రాంగం కార్యచరణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఇప్పుడున్న మోడరన్ పద్ధతులతో ఇలాంటి ప్రమాదాలు కారణంగా నేలకొరిగిన చెట్టును మళ్లీ నిలబెట్టడం పెద్ద విషయమేమీ కాదు. కాకపోతే కాస్త ఖర్చవుతుంది. 300 సినిమాల్లో కనిపించిన ఈ చెట్టుని మళ్లీ నిలబెట్టి దానిని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుందని ఏపీ అధికారులు ప్రభుత్వ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.