జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతానికి ఆయన జైలర్ 2 సినిమా పట్టాలెక్కించాడు. ఈ రోజు నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదేంటంటే ఈ సినిమాకి రాక్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద జూనియర్ ఎన్టీఆర్ తో పాటు నెల్సన్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయడానికి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఈ సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
Dilruba : పవన్ ఇమేజ్ ను బాగా వాడేస్తున్న కిరణ్ అబ్బవరం..
ఎన్టీఆర్ ప్రస్తుతానికి వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత దేవర 2 ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసుకుని సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత వెంటనే దిలీప్ నెల్సన్ సినిమా చేస్తాడా లేక కొరటాల శివతో దేవర 2 షూట్ చేస్తాడా లేక ఇవి రెండూ కలిపి ఒకే సమయంలో షూట్ చేస్తాడా అనే విషయం క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాకి సంబంధించిన టైటిల్ మాత్రం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే..