ఎన్టీఆర్.. ఈ పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకాలే. తాత ఘన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రములో బాల నటుడిగా తెరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. 2001లో ‘నిన్ను చూడాలని’ మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ తో విజయం అందుకున్న తారక్. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నటనలో తాత నందమూరి తారకరామారావులా.. డాన్స్ లో మైకేల్ జాక్సన్ లా మెప్పించి.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నాడు. ‘RRR’ తో ఏకంగా ఎన్టీఆర్ స్థాయి పాన్ ఇండియా వరకు చేరుకుంది. సౌత్ నార్త్ తేడా లేకుండా ప్రతి ఒక్కరు తారక్ డ్యాన్స్ , యాక్టింగ్ కు ఫిదా అయిపోతున్నారు. ఇక నేడు తారక్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మోత మోగిపోయింది.
Also Read : Thapsee : ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న..
ఒకటీ, రెండూ కాదు ఏకంగా పదుల సంఖ్యలో హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయంటేనే ఎన్టీఆర్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులంతా ఓ పండగల సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కేవలం ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లోనూ ఎన్టీఆర్ కు వీరాభిమానులున్నారు. ముఖ్యంగా జపాన్ లో తారక్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అలాగే హీరోలు సెలబ్రేటిలు అంతా కూడా తారక్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా విష్ చేశారు ‘హ్యాపీ బర్త్ డే బావ’ అంటూ తెలిపారు. ఇక్కడ బన్నీ తారక్‌ను బావ అనడం ఆశ్చర్యని కలిగిస్తోంది.
Happy Birthday Bava @tarak9999 !
Wishing you all the success , Joy & Happiness 🖤— Allu Arjun (@alluarjun) May 20, 2025