స్టార్ హీరోల సినిమాలు 2025 సంక్రాంతి రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. ముందుగా మెగా పావుర స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ను పొంగల్ కానుకగా జనవరి 10 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నామని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. అలాగే పొంగల్ కు వస్తున్న మరో సినిమా వెంకీ, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’. ఇక బాబీ – బాలయ్య సినిమా కూడా సంక్రాంతికి రానుంది.
Also Read : Devara: నందమూరి ఫ్యాన్స్ పై కీలక వ్యాఖ్యలు చేసిన నాగవంశీ..
ఈ సినిమా విడుదలపై నిర్మాత నాగవంశీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు. నాగవంశీ మాట్లాడుతూ ‘బాలయ్య సినిమా ఎప్పుడు చూడని విధంగా ఉంటుంది, కొత్త బాలయ్యను చుస్తారు. ఇప్పటిదాకా బాలయ్య ను ఇలా ఎవరు చూపించలేదు. బాబీ ఇంతకు ముందు సినిమాల కంటే డిఫ్రెంట్ గా ఉంటుంది. మొత్తం సినిమాలో ఓ ఐదు ఆరు సీన్స్ కు థియేటర్స్ బ్లాస్టింగ్ అవుతాయి. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో బాలయ్య నటన అద్భుతం. బాబీ డియోల్, బాలయ్య ఫేస్ ఆఫ్ సీన్స్ మాస్ ఆడియెన్స్ కు ట్రీట్. బాలయ్య తో చేస్తున్న సినిమా బాబీ కెరీర్ లో బెస్ట్ వర్క్ సినిమా. నా సినిమా అని చెప్పట్లేదు గాని ఈ సినిమా పక్కా హిట్. బాబీ తప్పుగా అనుకోవచ్చు గాని కథ పరంగా గాని, టేకింగ్ పరంగాని, విజువలైజ్ గాని, టెక్నికల్ గా గాని ఈ సినిమా బాబీ కెరీర్ బెస్ట్ వర్క్. దీపావళి కానుకగా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేస్తాం, సంక్రాంతికి సినిమా రిలీజ్’ అని అన్నారు.