తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్ స్టార్ట్ అవ్వటానికి ముందు యాంకర్ సుమ నాగచైతన్య శోభిత కలిసి ఉన్న ఫోటో స్టేజి మీద వేయించి ఈ ఫోటో చూస్తూ మీరు ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి లేదా డైలాగ్ డెడికేట్ చేయాలి అని అడిగితే ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బుజ్జి తల్లి పాటనే డెడికేట్ చేస్తాను. ఎందుకంటే నేను ఆమె ఇంట్లో బుజ్జి తల్లి అనే పిలుస్తాను.
Sai Pallavi: డైరెక్టర్ సీక్రెట్స్ లీక్ చేసిన సాయి పల్లవి.. పాపం ఆడేసుకుందిగా!
చందు కి కూడా చెప్పాను సినిమా మొదలవకముందే అని అన్నారు. దానికి చందు కల్పించుకుని అవును ఇది విని నేను కూడా ఆశ్చర్యపోయాను అని అన్నారు. ఇక వీరి మ్యారేజ్ ఫంక్షన్ కి వెళితే నిజానికి బుజ్జి తల్లి అనేది నా పేరు, సరే సినిమా వరకు ఓకే అనుకుంటే పాట కూడా పాడేశారా అని ఆమె అన్నారని చెందూ చెప్పుకొచ్చారు. దానికి నాగచైతన్య మాట్లాడుతూ పాట వచ్చాక శోభిత చాలా ఫీల్ అయిందని అన్నారు.. ఆమె బుజ్జి తల్లి అనేది తన సిగ్నేచర్ లాగా ఫీల్ అయ్యేది. దాన్ని నేను ఎలా సినిమాల్లో వాడేస్తా అంటూ ఆవిడ ఫీల్ అయింది అని చెప్పుకొచ్చారు.