సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో కన్నడ సోయగం నభా నటేష్ టాలీవుడ్ తెరంగేట్రం చేశారు. మొదటి సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకోకపోయినా.. రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’లో గ్లామర్ ట్రీట్ ఇచ్చి యూత్ గుండెల్లో నభా గత్తర లేపారు. ఆ తర్వాత క్రేజ్ కాపాడుకోలేకపోయారు. ‘డిస్కో రాజా’, ‘అల్లుడు అదుర్స్’ వరుస డిజాస్టర్స్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ కాస్త బెటర్ అనిపించుకుంది.
2022లో యాక్సిడెంట్ కారణంగా నభా నటేష్ యాక్టింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చారు. కోలుకున్నాక మళ్లీ కెరీర్‌పై ఫోకస్ స్టార్ట్ చేశారు. ప్రియదర్శి ‘డార్లింగ్’తో బౌన్స్ బ్యాక్ అవుతానని ఆశించినా.. పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక నభా పని అయిపోయినట్లే అనుకున్న సమయంలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఆమెను వరించాయి. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ ‘స్వయంభు’ సహా ‘నాగ బంధం’లో ఫిక్స్ అయ్యారు. స్వయంభులో సంయుక్తతో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కానీ రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాల నుంచి అప్డేట్స్ లేవు అనుకుంటున్న టైంలో ఫిబ్రవరి 13న స్వయంభు వస్తుందని హీరో నిఖిల్ ప్రకటించారు.
Also Read: Pawan Kalyan-Anil Ravipudi: పవన్ కల్యాణ్-అనిల్ రావిపూడి కాంబో.. టాలీవుడ్‌లో జోరుగా టాక్?
డెవిల్ తర్వాత అభిషేక్ నామా దర్శకుడిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మైథాలజీ ఫిల్మ్ ‘నాగబంధం’. ఇందులో విరాట్ కృష్ణ హీరో. ఏడాది క్రితం ఈ మూవీ స్టార్టైంది. అప్పుడెప్పుడో గ్లింప్స్ రిలీజ్ చేశారు, ఆ తర్వాత నో అప్టేడ్. తాజాగా నభా నటేష్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ వదిలారు. పార్వతిగా నభా స్టన్నింగ్ లుక్స్‌లోఅందరినీ కట్టిపడేశారు. ఇప్పటి వరకు గ్లామర్ బ్యూటీగా కనిపించిన నభా.. ఇందులో డివోషనల్ లుక్స్‌లో మెస్మరైజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ మరో హీరోయిన్. నాగబంధం మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. క్లైమాక్స్ సీన్ కోసం ప్రొడ్యూసర్ భారీగా ఖర్చు పెట్టారట. నాగబంధంను ఈ ఏడాదే పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో లైమ్ లైట్‌లోకి వచ్చిన నభా.. బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి.