‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నటి మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్ సరసన సీతగా నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ నాని సరసన నటించి అలరించింది ఈ భామ. శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బేబీ కియారా ఓ కీలక పాత్ర పోషించింది. కాగా హాయ్ నాన్న చిత్రంలో తండ్రి కూతుళ్ల బంధం గురించి చాలా చక్కగా చూపించారు. తల్లి పాత్రలో మృణాల్ కూడా అద్భుతంగా నటించింది. ఇక కొన్ని సార్లు ఆన్ స్క్రీన్ లో ఏర్పడిన బంధాలు ఆఫ్ స్క్రీన్ లో కంటిన్యూ అవ్వడం చూసాం. అలాంటిదే మృణాల్ బేబీ కియారా మధ్య అనుబంధం ఉందని తెలుస్తోంది. హాయ్‌నాన్న నటించిన కియారాతో తనకు అలాంటి అనుబంధం ఏర్పడిందని తెలిపింది.
Also Read: Tollywood : టుడేస్ టాలీవుడ్ ట్రేండింగ్ న్యూస్.. ఒక్క క్లిక్ లోనే…
‘వయస్సులో నాకంటే చాలా చిన్నది అయినా నన్ను యష్నా లేదా ఎం అని పిలుస్తుంది. తను ఎప్పటికీ నా మొదటి పాపే. నాకు పిల్లలు పుట్టిన వారు నాకు రెండో సంతానమే అవుతారు…ఎందుకంటే కియారాతో ఏర్పడిన అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేనిది. తను కళ్లతోనే ఎన్నో విషయాలను మాట్లాడేస్తుంది. తన నుంచి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నా’ అంటూ సినిమా షూటింగ్ వీడియోను పోస్ట్ చేసింది. దీనిపై చిన్నారి కియారా స్పందిస్తూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న .మిమ్మల్ని కలవడం నా అదృష్టం. ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం నాకు ఉండాలి. త్వరలోనే నన్ను కలవండి అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి మృణాల్ రెండు హార్ట్ సింబల్స్ ను పోస్ట్ చేసి తన ప్రేమను వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ పోస్టులు నెట్టింట తెగ హల్ చల్ అవుతున్నాయి.