సినీ ఇండస్ట్రీలో స్టోరీలను క్రియేట్ చేయలేకపోతున్నారా. అందుకే కథలను కాపీ కొడుతున్నారా. అంటే అలాగే కనిపిస్తోంది ప్రజెంట్ సిచ్యుయేషన్. రీమేక్ ముద్ర ఎందుకు అనుకుంటున్నారో ఏకంగా ఒకే కథతో సినిమాలు లేదా సిరీస్‌లు తెచ్చేస్తున్నారు. పటాస్, టెంపర్ ఒకే స్టోరీతో వచ్చిన కథలే. అంటే సుందరానికి, కృష్ణ వ్రింద విహారీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. గతంలో రేర్‌గా ఇలాంటి ఇన్సిడెన్స్ జరిగేవి ఇప్పుడు ఈ ధోరణి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తండేల్ అరేబియన్ కడలి వెబ్ సిరీస్‌గా తెరకెక్కించారు. ఈ రెండు ఆరు నెలల గ్యాప్‌లోనే ప్రేక్షకులను పలకరించాయి.
Also Read : Prabhas : ఫీల్ అవకండి డార్లింగ్స్.. అక్టోబర్ నుండి రెబల్ టైమ్ స్టార్ట్..
రీమేక్స్ చేయడం వేరు ఏకంగా కథనే కాపీ చేసి సినిమాను తెరకెక్కించడం వేరు. ఇప్పుడు ఇదే ట్రెండ్‌లా మారింది. థియేటర్ పిక్చర్లకే ఈ సమస్య అనుకుంటే ఓటీటీకి పాకింది. మా కథ కాపీ కొట్టారంటూ విరాట పాలెం వెబ్ సిరీస్‌పై ఆరోపణలు చేసింది కానిస్టేబుల్ కనకం టీం. ఇందులో కీ పాయింట్ ఒకటే.. కానీ స్క్రీన్ ప్లే మొత్తం వేర్వేరు. కానీ కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తుంటాయి. దుల్కర్ తెరకెక్కిస్తోన్న పీరియాడిక్ డ్రామా కాంత కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ తొలి తరం సూపర్ స్టార్, గాయకుడు మయవరం కృష్ణస్వామి త్యాగరాజ భాగవతార్ అలియాస్ ఎంకేటీ కథతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆయన స్టోరీ ఆధారంగా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోంది సోనీ లివ్. ద మద్రాస్ మిస్టరీ- ద ఫాల్ ఆఫ్ సూపర్ స్టార్ అంటూ టైటిల్ ఎనౌన్స్ చేసింది. నజ్రియా కీ రోల్ ప్లే చేస్తున్న ఈసిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కాబోతుంది. కాంతకి ద మద్రాస్ స్టోరీ ఒకే స్టోరీనా లేదా డిఫరెంటా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.