ఈ ఏడాది ఫ్యాన్స్‌ను గట్టిగానే హర్ట్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. ఇయర్లీ మినిమం వన్.. మాగ్జిమం టూ ఫిల్మ్స్‌తో వస్తానని గతంలో ప్రామిస్ చేసాడు రెబల్ స్టార్. కానీ ఈ ఏడాది తన సినిమా రిలీజ్ ను స్కిప్ చేశాడు. రాజా సాబ్ కోసం ఇయర్ స్టార్టింగ్ నుండి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు నీరసం తెప్పించాడు. ఇయర్ ఎండింగ్‌లోనైనా డార్లింగ్ రాక ఉంటుందని ఆశపడితే నెక్ట్స్ ఇయర్ జనవరిలో మూవీ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తెలియజేసాడు.
Also Read : Aishwarya : సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసిన గ్లామరస్ బ్యూటీ.. కారణం ఇదే
తన సినిమాలు రిలీజ్ లు డిలే అవుతుండడం కారణంగా ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇవ్వలేకపోయానని గ్రహించిన ప్రభాస్ తాజాగా మిరాయ్‌లో వాయిస్ ఓవర్ ద్వారా చిన్న ట్రీట్ ఇచ్చి ఖుషీ చేశాడు. చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ బూస్టర్ అయ్యాడు. అలాగే కన్నప్పలో రుద్రగా 15 నిమిషాలు కనిపించి సినిమా భారీ ఓపెనింగ్స్‌కు కారణమైన డార్లింగ్. డార్లింగ్ నుండి సినిమాలు రాకపోయినా అప్ కమింగ్ ఫిల్మ్స్ అప్డేట్స్ లోడ్ కాబోతున్నాయి. అక్టోబర్ మంత్ మొత్తం ప్రభాస్ ఆక్యుపై చేయబోతున్నాడు. కాంతారా పార్ట్ 1 సినిమాకు రాజా సాబ్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ప్రీరిలీజ్ ఈవెంట్స్‌తో సందడి చేయబోతున్నాడు. అక్టోబర్ 23న డార్లింగ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవే కాదు హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ నుండి కూడా ట్రీట్స్ ఉండబోతున్నాయన్నది టాక్. అలాగే అక్టోబర్ 31న థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ రాబోతుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ను పలకరించేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నాడు ప్రభాస్.