Manik rao Thackeray: తెలంగాణలో థాక్రే పర్యటన.. అక్కడకు రావాలని కోమటిరెడ్డి ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manik rao Thackeray: అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న తెలంగాణ పీసీసీకి కొత్త దిశానిర్దేశం చేయాలని ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రే ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలంగాణ నూతన ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే ను ఎయిర్ పోర్ట్ లోని లాంజ్ లో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్ ఆహ్వానించారు. అనంతరం గాంధి భవన్ లో లాల్ బహదూర్ శాస్త్రీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ థాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాగా.. థాక్రే తెలంగాణలో రెండు రోజుల పాటు థాక్రే పర్యటించనున్నారు. ఇవాళ గాంధీ భవన్ లో ఉదయం 10.30 నుంచి వరసగా సమావేశాలు నిర్వహించనున్నారు. మొదట ఇంచార్జ్ ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం తర్వాత పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేత, పీఏసీ సభ్యులతో వ్యక్తిగత భేటీ కానున్నారు. ఇక రాత్రి 7 గంటలకు పీఏసీ సభ్యుల సమావేశం ఉంటుంది. రేపు డీసీసీ లు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్ లు, అధికార ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీలో సీనియర్, జూనియర్ నేతల మధ్య నెలకొన్న ‘టగ్ ఆఫ్ వార్’ను ఆయన ఎలా పరిష్కరిస్తారన్నది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి రాజీనామా లేఖలతో నివ్వెరపోయిన సీనియర్లను ఎలా బుజ్జగిస్తారో చూడాలి. మాణిక్కం ఠాకూర్‌తో అవలీలగా సమస్యను పరిష్కరించగలరన్న నమ్మకంతో పార్టీ నాయకత్వం ఆయనను పంపింది.
Read also: VandeBharat: సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు.. టైమింగ్స్ ఇవే.. స్పీడ్ ఇంత తక్కువా?
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
కాగా.. ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి మాణిక్ రావు థాక్రే ఫోన్ చేశారు. గాంధీ భవన్ కు ఠాక్రేకు ఆహ్వానించారు. అయితే థాక్రేను బయటే కలుస్తా అని కోమటి రెడ్డి తెలపడంతో.. కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అయితే కోమటిరెడ్డితో థాక్రే కలుస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది. ఒకవేళ కలిస్తే ఏం మాట్లాడుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. రేవంత్ పై విమర్శలు గుప్పిస్తారా? అనేదానిపై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు మాట్లాడుతూ.. ఠాగూర్ తో సమస్యలు ఏమీ లేవన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అన్నారు. కొత్త ఇంఛార్జితో అన్నీ సర్దుకుపోతాయని భరోసా ఇచ్చారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. 77 సీట్ల లో కాంగ్రెస్ గెలవబోతుందని అన్నారు. అందరిని కలుపుకుని పోయేలా కొత్త ఇంచార్జి పని చేస్తారని స్పష్టం చేశారు.
అయితే.. గతంలో తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు చూసిన మాణిక్యం ఠాగూర్‌ను గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే.. కాగా..టీ కాంగ్రెస్‌లో వాట్సాప్ గ్రూప్ గందరగోళం నెలకొంది. మాణిక్యం ఠాగూర్ వైదొలగినట్లు ప్రచారం సాగింది.. వాట్సాప్ గ్రూప్‌లోనే ఉన్నారంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్పొకొచ్చారు. అయితే.. కొద్దిరోజుల క్రితం సాంకేతిక సమస్య వల్ల ఎగ్జిట్ అయ్యారంటూ మరి కొందరు వివరించారు. ఇకతాజాగా ఇక సెలవు.. అంటూ.. టీ కాంగ్రెస్ నేతలకు బై చెప్పారు మాణిక్కం ఠాగూర్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారని.. ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆయన రాజీనామా లేఖ పంపించినట్లు ప్రచారం జరిగినా.. చివరికి అదే నిజమైంది. ఆ స్థానంలో మాణిక్‌రావు థాక్రే అధిష్ఠానం నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఠాగూర్‌నుతీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది అధిష్టానం. ఆ వెంటనే టీ.కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్‌ల నుంచి మాణిక్కం ఠాగూర్ లెఫ్ట్ అయ్యారు. అప్పటి వరకు అందరికీ ధన్యవాదాలు అంటూ మెసేజ్ కూడా చేశారు.
Errabelli Pradeep: మొన్న పొంగులేటి.. ఇప్పుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు.. సెక్యూరిటీ తొలగింపు
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!