ప్రస్తుతం నడుస్తున్నది సొషల్ మీడియా కాలం. నచ్చింది ఏదైనా క్షణంలో వైరల్ అవుతుంది. అయితే, సొషల్ మీడియాలో ఒకటి మరో దానికి కారణం అవుతూ ఒక్కోసారి భలే దుమారం రేగుతుంటుంది! ‘ఆర్ఆర్ఆర్’ తాజా పోస్టర్ అదే పని చేసింది! రాజమౌళి మాస్టర్ పీస్ పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతే కాదు, డబ్బింగ్ కూడా వీలైనంత వేగంగా కానిచ్చేస్తున్నారు. అయితే, ఇప్పటికీ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ రిలీజ్ ఎప్పుడో క్లారిటీ లేదు. ఈలోపు మరో కొత్త పిక్ తో చెర్రీ, తారక్ ఫ్యాన్స్ నైతే జక్కన్న లెటెస్ట్ గా సర్ ప్రైజ్ చేశాడు!
Read Also : నెట్టింట్లో సెగలు పుట్టిస్తున్న రకుల్ బికినీ లుక్…!
యంగ్ టైగర్ తో మెగాపవర్ స్టార్ బైక్ రైడింగ్ చేస్తున్నట్టుగా ఉంది… ‘ఆర్ఆర్ఆర్’ న్యూ పోస్టర్. అయితే, ఈ ఫోటో కాస్తా బోలెడు మీమ్స్ కి కట్టలు తెంచింది. మరీ ముఖ్యంగా, ‘ఆర్ఆర్ఆర్’ అందగాళ్లు ఇద్దరి సరికొత్త లుక్ నెటిజన్స్ లో క్రేజీగా మారటంతో హైద్రాబాద్ పోలీస్ కూడా సమయానుకూలంగా వాడేసుకున్నారు. ఒరిజినల్ ఫోటోలో హీరోలిద్దరికీ హెల్మెట్స్ లేకపోవటంతో ఫోటోషాప్ ద్వారా హెల్మెట్స్ ఏర్పాటు చేసి పోలీసులు సోషల్ మీడియాలో తమ వర్షన్ రిలీజ్ చేశారు! అయితే, ‘’ఇంకా నంబర్ ప్లేట్ కూడా లేదు’’ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ హైద్రాబాద్ పోలీసుల ఎడిటెడ్ ఫోటో కింద నాటీ కామెంట్ చేయటం… అసలు కొసమెరుపు!
Read Also : ఎమోషనల్ అయిన అనుష్క! సోషల్ మీడియాలో స్వీటీ భావోద్వేగం…
‘ఆర్ఆర్ఆర్’ న్యూ పోస్టర్ ను పోలీసులే కాదు సొషల్ మీడియా ఫోటోషాప్ తోపులు కూడా తోచినంత వాడేసుకున్నారు. ఎన్టీఆర్, చరణ్ కూర్చున్న బైక్ పై రకరకాల కొత్త కాంబినేషన్స్ ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి. చరణ్-చిరు, పవన్-చరణ్, విరాట్ కోహ్లీ లాంటి పలువురు క్రికెటర్స్, ఎంఎస్ నారాయణ – వేణుమాధవ్ లాంటి కమెడియన్స్, చివరకు పూరీ జగన్నాథ్ – త్రివిక్రమ్ లాంటి దర్శకుల్ని కూడా ‘ఆర్ఆర్ఆర్’ బైక్ ఎక్కించేశారు ఎడిటింగ్ వీరులు! ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ బైక్ రైడింగ్ మీమ్స్ ను మీరూ చూడండి…