ప్రముఖ దర్శకుడు మారుతి, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “రాజా సాబ్” గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన “మాడ్ స్క్వేర్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అతిథిగా పాల్గొన్న మారుతి, “నా చేత ఎలాంటి సినిమా చేస్తే ఆడియన్స్‌కి బాగా నచ్చుతుందో, అలాంటి సినిమానే ప్రభాస్‌తో తీయిస్తున్నాను. అందుకే చాలా సంతోషంగా, ధైర్యంగా, ఎలాంటి ఆందోళన లేకుండా పని చేస్తున్నా. ఇలా ఉంటేనే ది బెస్ట్ సినిమా వస్తుందని నమ్ముతున్నా” అని అన్నారు. “రాజా సాబ్” ఒక ప్రేమ, కామెడీ, హారర్ అంశాలతో కూడిన చిత్రంగా రూపొందుతోంది.
Ravishankar : ఆ సీన్ లో రామ్ చరణ్ ను చూస్తే మైండ్ పోతుందిః నిర్మాత రవిశంకర్
ప్రభాస్ ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రచారం జరిగిన ఈ చిత్రం ఇప్పటికే 40% షూటింగ్ పూర్తి చేసుకుంది. మారుతి గతంలో “ప్రేమ కథా చిత్రం” వంటి విజయవంతమైన హారర్ కామెడీ చిత్రాలను రూపొందించిన నేపథ్యంలో, “రాజా సాబ్”పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రభాస్ లాంటి పాన్-ఇండియా స్టార్‌తో మారుతి కాంబినేషన్ ఆడియన్స్‌కి కొత్త అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.