Ravishankar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఆర్సీ16 మీద భారీ అంచనాలు ఉన్నాయి. రేపు గురువారం చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. దాని కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మూవీ గురించి తాజాగా నిర్మాత రవిశంకర్ చేసిన కామెంట్స్ తో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా ఆయన రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ లో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్సీ16పై ప్రశ్న వస్తే స్పందించారు. ‘నేను ఆర్సీ 16 షూటింగ్ కు వెళ్లాను. అందులో ఓ సీన్ తెరకెక్కించే విధానం చూస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఆ సీన్ లో రామ్ చరణ్ ను చూసేందుకు ప్రేక్షకులు కనీసం వెయ్యి సార్లు అయినా ఆ గ్లింప్స్ చూస్తారు’ అంటూ చెప్పారు.
Read Also : Robinhood : భీష్మ కంటే రాబిన్ హుడ్ బెస్ట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందిః నితిన్
ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. బుచ్చిబాబు చరణ్ కు పర్ ఫెక్ట్ సినిమాను రెడీ చేస్తున్నాడంటూ అప్పుడే కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ లో చరణ్ చేతిలో చుట్టతో చాలా రగ్డ్ గా కనిపిస్తున్నాడు. ఇందులో ఆయన చాలా మాస్ గా ఉన్నారు. ఇంక ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. రేపు ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా రేపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.