మిల్కీ బ్యూటీ తమన్నా ఓ పాపులర్ కుకింగ్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ షోపై అధికారిక ప్రకటన వెలువడింది. “మాస్టర్ చెఫ్ ఇండియా” తెలుగు షోకు తమన్నా వ్యాఖ్యాతగా చేస్తోంది. జెమినీ టీవీలో వరల్డ్ ఫేమస్ కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ తెలుగు ఎడిషన్ రానుంది. ఈ షోలో విజేతకు రూ. 25 లక్షల బహుమతి ఇవ్వబోతున్నారు. అయితే ఇదే షోను తమిళంలో కూడా ప్రసారం చేయనున్నారు. అయితే తమిళ వెర్షన్ కు మాత్రం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. జెమినిలో ప్రసారం కానున్న ఈ షో కోసం ప్రోమోను షూట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పిక్ ను షేర్ చేశారు షో నిర్వాహకులు. అందులో విజయ్ సేతుపతితో పాటు తమన్నా కూడా ఉంది. విజయ్ సేతుపతి బ్లాక్ డ్రెస్ లో ఉండగా… తమన్నా బ్రౌన్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతోంది. ఈ షో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందో చూడాలి.
Read Also : ఆసక్తిని పెంచేస్తోన్న “3:33” టీజర్
ఇక తమన్నా ప్రస్తుతం సినిమాలతో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఇటీవలే “నవంబర్ స్టోరీ” అనే వెబ్ సిరీస్ తో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తమన్నా నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ భామ హోస్ట్ గా వ్యవహరిస్తున్న వంటల షోకు ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.