అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేసారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చారు. బావ బావమరుదులు కలిసి అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాలేజ్ స్టూడెంట్ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వరకు తన ప్రయాణాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మిలియన్ వ్యూస్ ఈ ఎపిసోడ్ రన్ అవుతోంది.
Also Read : VD: విజయ్ దేవరకొండ ‘పెళ్ళి చూపులు’.. అమ్మాయి ఎవరంటే..?
కాగా అన్‌స్టాపబుల్ రెండవ ఎపిసోడ్ ను దీపావళి కానుకగా స్ట్రీమింగ్ కు తీసుకురానుంది ఆహా. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ ను షూట్ చేసి రెడీ గా ఉంచింది అన్‌స్టాపబుల్ యూనిట్. అందులో దుల్కర్ సల్మాన్, సూర్య, అల్లు అర్జున్ ఎపిసోడ్స్ ఉన్నాయి, కాగా ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ గా దుల్కర్ సల్మాన్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ తీసుకురానున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో అన్ స్టాపబుల్ స్టేజి పై దుల్కర్, మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. అందుకు సంభందించి ఫొటోస్ రిలీజ్ చేసారు మేకర్స్. బాలయ్య ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరని, అసలు అయన టాక్ షో హోస్ట్ గా, హాస్పిటల్ ఛైర్మెన్ గా, సినిమాలలో హీరోగా, హిందూపురం ఎమ్మెల్యే గా బ్యాలెన్స్ చేయడం మాములు విషయం కాదని టాక్ షో అనంతరం నటుడు దుల్కర్ సల్మాన్ తెలిపారు.