ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ఫస్ట్ కొలాబరేషన్ మూవీ షూటింగ్ ఏప్రిల్ 15న మొదలు కావాల్సింది. కానీ కత్రినా కు కొవిడ్ 19 పాజిటివ్ రావడంతో అది కాస్తా పోస్ట్ పోన్ అయ్యింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రమేశ్ తురానీ దీనిని నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా ఇవాళ దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో ఏ ప్రాజెక్ట్స్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొంది. కత్రినాతో సినిమా తిరిగి ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడప్పుడే చెప్పలేనని విజయ్ సేతుపతి అంటున్నాడు. అదే విధంగా ఇప్పటికే విజయ్ సేతుపతి ‘ది ఫ్యామిలీ మెన్’ ఫేమ్ రాజ్, డీకేలతో ఓ వెబ్ సీరీస్ కు కమిట్ అయ్యాడు. అన్ని అనుకున్నట్టు జరిగితే, దాని షూటింగ్ మే నెలాఖరులో మొదలు కావాలి. కానీ ఇప్పుడు అది కూడా అనుకున్న సమయానికి మొదలవుతుందో లేదో తెలియని అయోమయం నెలకొందని విజయ్ సేతుపతి అంటున్నాడు. చెన్నయ్ లో సినిమా షూటింగ్స్ టైమ్ లో అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నామని, కానీ ముంబైలో పరిస్థితి అర్థం కాకుండా ఉందని విజయ్ సేతుపతి వాపోయాడు.