కరణ్ జోహార్ చిత్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ శుక్రవారం తమ జిగ్రా సినిమా విడుదలవవడానికి ముందు ఫిల్మ్ క్రిటిక్స్ లేదా మీడియాకి ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ షో వేయడం లేదని ప్రకటించారు. ఈ మేరకు కరణ్ జోహార్, ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతాలు లేఖ కూడా విడుదల చేశారు. ఆ లేఖలో “ప్రియమైన మీడియా సభ్యులారా” అని సంబోధిస్తూ, “సంవత్సరాలు, దశాబ్దాలుగా మీరు ధర్మ ప్రొడక్షన్స్‌లో మాకు అండగా నిలిచారు, మా చిత్రాలకు మద్దతు ఇస్తున్నారు, మా కలలను పంచుకున్నారు, మా విజయాలను మీవిగా జరుపుకుంటున్నారు.
Ka Movie: ‘మాస్ జాతర’ సాంగ్ అదిరిందే!
మాపై మీ విశ్వాసం మా ప్రయాణంలో ఒక డ్రైవింగ్ ఫోర్స్. ప్రతి కవరేజ్, రివ్యూ అలాగే ఫీడ్‌బ్యాక్ మాకు అమూల్యమైనవి. అయితే చాలా చర్చల తర్వాత, మా రాబోయే చిత్రాలకు ప్రీ-రిలీజ్ స్క్రీనింగ్‌లను నిలిపివేయాలని మేము ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. ఈ నిర్ణయానికి రావడం కష్టమే అయినప్పటికీ, ప్రీ-రిలీజ్ స్క్రీనింగ్‌లు ఉండనప్పటికీ, సకాలంలో రివ్యూస్ కోసం సినిమా విడుదల రోజు ప్రెస్ కోసం ప్రదర్శనలను నిర్వహిస్తామని ప్రొడక్షన్ హౌస్ స్పష్టం చేసింది. ఈ స్క్రీనింగ్‌లలో మాతో చేరడానికి మేము అన్ని మీడియా హౌస్ ల సిబ్బందిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము అని అంటూ రాసుకొచ్చారు. ఈలెక్కన అన్ని ప్రొడక్షన్ హౌసులు కూడా కరణ్ జోహార్ బాటలో నడవడం పెద్ద విషయం ఏమీ కాదని అంటున్నారు.