Karthi 25th film: 2007లో హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి తనదంటూ ఓ ముద్ర వేసుకుని అభిమానుల మదిని గెలుచుకున్నాడు కార్తీ. 2022 లో తమిళంలో వరుసగా 3 హిట్స్ కొట్టాడు. తాజాగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న సినిమా పూజతో మొదలైంది. ఈ సినిమాకు ‘జపాన్’ అనే టైటిల్ ని నిర్ణయించారు. ‘శకుని’, ‘కాష్మోరా’, ‘ఖాకీ’, ‘ఖైదీ’, ‘సుల్తాన్’ తర్వాత కార్తీ 6వ సారి ‘జపాన్’ కోసం డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ సంస్థలో నటిస్తున్నాడు. కార్తీకి ఇది 25వ సినిమా కావడం విశేషం. ఇందులో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటించనుంది. సునీల్ ‘జపాన్’లో కీలక పాత్ర పోషిస్తూ తమిళంలో అరంగేట్రం చేస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్‌గా 25 ఏళ్ల అనుభవం ఉండి ‘గోలి సోడా’, ‘కడుగు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటిన విజయ్ మిల్టన్ ‘జపాన్’ లో తొలిసారి నటిస్తున్నాడు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘జపాన్’ మంగళవారం ఉదయం పూజతో ఆరంభం అయింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై టీమ్ కి విషెస్ తెలియచేశారు. త్వరలోనే తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది. త్వరలోనే ‘జపాన్’ ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
Governor Tamilisai vs DMK: తమిళిసైని టార్గెట్ చేసిన డీఎంకే.. గవర్నర్ కౌంటర్ ఎటాక్