సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. గత రెండు రోజులుగా విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం (నవంబర్ 22, 2025) మూడో రోజు విచారణను కూడా ముగించారు. అయితే, రవి విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు వెల్లడించారు. మూడో రోజు విచారణలో కీలక సమాచారం రాబట్టాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ, నిందితుడు ఇమ్మడి రవి వారిని తప్పుదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read :సాహితి దాసరి రెడ్ సారీ స్పెషల్: మత్తెక్కించే గ్లామర్ షో
పోలీసులు ఐబొమ్మ కార్యకలాపాలకు సంబంధించిన ముఖ్య వివరాలు అడిగినా, రవి పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. ఐబొమ్మ వెబ్‌సైట్‌కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు అడిగితే… గుర్తు లేవు, మరిచిపోయా అని సమాధానం ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రవి ఉద్దేశపూర్వకంగానే సమాచారాన్ని దాచిపెడుతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రవి సహకరించకపోవడంతో, కీలక ఆధారాలు సేకరించడానికి పోలీసులు ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకుంటున్నారు. రవికి సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లలో ఉన్న సమాచారాన్ని తెరవడానికి, డీకోడ్ చేయడానికి నిపుణుల సాయం తీసుకుంటున్నారు. ఈ మెథడ్ ద్వారా రవి దాచిపెట్టిన కీలకమైన సర్వర్ సమాచారం, ఆర్థిక లావాదేవీల చిట్టాను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read :Anchor Shivajyothi : తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు.. వివాదంలో శివజ్యోతి
పోలీసుల దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి. ఐబొమ్మ వెబ్‌సైట్ యొక్క మెయిన్ సర్వర్లు ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో, విచారణ పరిధి అంతర్జాతీయంగా విస్తరించింది. ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా రవి భారీగా అక్రమ ధనాన్ని ఆర్జించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, తన బ్యాంక్ ఖాతాల వివరాలపైనా రవి నోరు విప్పడం లేదు. దీంతో, రవికి సంబంధించిన అకౌంట్ల చిట్టా (వివరాలు) ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే పలు బ్యాంకులకు మెయిల్ చేసినట్లు సమాచారం. బ్యాంక్ వివరాలు వస్తే, మొత్తం లావాదేవీల గురించి స్పష్టత వస్తుంది. రవి విదేశీ పర్యటనలు కూడా పోలీసుల అనుమానాలకు తావిచ్చాయి. రవి దాదాపు ప్రతి 20 రోజులకు ఒకసారి ఒక్కో దేశానికి వెళ్తున్నట్లు గుర్తించారు. దీనిపై ప్రశ్నించగా, రవి కేవలం “విదేశీ పర్యటనలు అంటే ఇష్టం ఉండటం వల్లే వెళ్లాను” అని అబద్ధం చెబుతున్నాడు. రవి విజిట్ చేసిన దేశాల్లో ఉన్న పైరసీ లింకుల కూపీ లాగుతూ, అంతర్జాతీయ పైరసీ నెట్‌వర్క్‌తో రవికి ఉన్న సంబంధాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.