I bomma Ravi: సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మ రవిని నేడు మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. నాంపల్లి కోర్టు ఐ బొమ్మ రవిని మరోసారి కస్టడీ అనుమతించింది. 3 రోజుల పాటు కస్టడీలో పోలీసులు విచారణ జరపనున్నారు. నేటి నుంచి 29వ తేదీ వరకు రవిని కస్టడీలో విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు ఐ బొమ్మ రవి..
సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. గత రెండు రోజులుగా విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం (నవంబర్ 22, 2025) మూడో రోజు విచారణను కూడా ముగించారు. అయితే, రవి విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు వెల్లడించారు. మూడో రోజు విచారణలో కీలక సమాచారం రాబట్టాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ, నిందితుడు ఇమ్మడి రవి వారిని తప్పుదారి పట్టిస్తున్నట్లు…