నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ సినిమా, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు . మే 1న రిలీజైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. ఈ క్రమంలో హిట్ 3 చిత్రం నాలుగు రోజుల్లోనే మేజర్ మైల్ స్టోన్ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.101 గ్రాస్ వసూళ్లను దక్కించుకుందని తెలుస్తోంది. ఫస్ట్ వీకెండ్ లో ఈ మైల్ షాన్ దాటి హిట్ 3 చిత్రం సత్తా చాటింది.
Also Read : Samantha : సమంతకు స్టేజ్ పైనే ఐ లవ్ యూ చెప్పిన యంగ్ హీరో..
మొత్తానికి నాని వరుసగా నాలుగో సూపర్ హిట్ కొట్టేశారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలు బ్లాక్ బస్టర్ కాగా.. ఇప్పుడు హిట్ 3 కూడా దుమ్మురేపుతోంది. చెప్పాలంటే నానికి ఇది మూడో రూ.100 కోట్ల చిత్రంగా నిలిచింది. ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్ లోగా రూ.200 కోట్ల మైలోన్ కూడా సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, సోమవారం ట్రెండ్‌న్ను బట్టి కలెక్షన్లు ఎలా సాగుతాయో తేలనుంది. అయినప్పటికి ‘హిట్ 3’ సినిమా ఇప్పటికే కొన్ని ఏరియాలో లాభాల్లోకి వచ్చేసింది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. నైజాం, ఓవర్సీస్ లో ఈ మూవీ ప్రాఫిట్ జోన్ ల్లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. వేసవిలో మొత్తానికి టాలీవుడ్‌ల్లో ఎట్టకేలకు ఓ సాలిడ్ హిట్ ఇచ్చింది.