మంచు కుటుంబంలో మొదలైన వివాదం జర్నలిస్ట్ పై దాడి చేయడంతో రచ్చకు దారితీసింది. జర్నలిస్ట్ పై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై కేసు నమోదు చేసారు పోలీసులు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబాకు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు బెయిల్ కోసం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు.
Also Read : Ram Charan : అభిమానుల మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన రామ్ చరణ్..
జర్నలిస్టు పై దాడి గతంలో తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ప్రస్తుతం తనకు 78 ఏళ్లని, గుండె ఇతర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టులోతనకు ముందస్తు బెయిల్ వస్తుందని మోహన్ బాబు నమ్మకంగా ఉన్నారు. అయితే మోహన్ బాబు పిటీషన్ ను స్వీకరించిన న్యాయస్థానం నేడు విచారించింది. అనంతరం సుప్రీంకోర్టు సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈ తీర్పును వెలువడించారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరాడు. అందుకు అంగీకరించని న్యాయస్థానం, వచ్చే గురువారం ఈ కేసు విచారణ చేస్తామని అప్పటి వరకు వాయిదా వేస్తున్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది.