'స్వాతిముత్యం' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ గణేశ్ కు చక్కని గుర్తింపు లభించింది. సినిమా గ్రాండ్ సక్సెస్ కాకపోయినా... గౌరవ ప్రదమైన విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీలో గణేశ్ చక్కగా సెట్ అయ్యాడని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.