మనుషుల జీవితాలకు బంగారం తో విడదీయరాని బంధం ఉంది. అలాంటి బంగారం సెంటిమెంట్ తో యు.కె.క్రియేషన్స్ పతాకంపై ఉదయ్ కుమార్, దేవిశ్రీ, రుక్మిణి ప్రధాన పాత్రధారులుగా ఉదయ్ కుమార్ ముంత దర్శకత్వంలో నవీన్ చంద్ర నిర్మిస్తున్న చిత్రం ‘గోల్డ్ మెడల్’. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్ధమయింది. ఈ సినిమాలో పాత్రలు బంగారంతో ఏ విధంగా ముడిపడి ఉన్నాయనే కథాంశంతో నిర్మించిన చిత్రమిదని అంటున్నాడు దర్శకుడు. ఇందులో హీరో జీవితాన్ని బంగారం ఏ విధమైన మలుపులు తిప్పిందనేది ఆసక్తికరంగా తెరకెక్కించామంటున్నాడు నిర్మాత నవీన్ చంద్ర. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తామంటూ కొత్త ప్రయత్నం తో వస్తున్న తమను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని అంటున్నాడు.
Read Also : రివ్యూ: ఎల్.కె.జి. (ఆహా)