పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తూ మధ్యలో ఆగిపోయిన సినిమాలను తిరిగి స్టార్ట్ చేసారు. హరిహర వీరమల్లు షూటింగ్ ను విజయవాడలో ఓ ప్రత్యేక సెట్ లో ఇటీవల కొన్ని రోజులు పాటు షూట్ చేసారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మరో సినిమా ఓజి (OG ), ఈ సినిమా షూట్ మూడు రోజుల నుండి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. నైట్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుజీత్.
Also Read : Rishab : తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంతార హీరో
పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరి చూపు OG పైనే ఎక్కువగా ఉంది. కాగా ఈ సినిమలో విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆదివారం నుండి జరుగుతున్న షెడ్యూల్‌లో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ అడుగుపెట్టనున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నేడు లేదా రేపు షూట్ లో హాజరుకాబోతున్నారు. ఇమ్రాన్, పవన్ కాంబోలో కీలక మైన సీన్స్ షూట్ చేయనున్నారని తెలుస్తోంది.మరోవైపు ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ను స్టార్ట్ చేసాడు థమన్. త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా OG స్పెషల్ కవర్ పిక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాతో గ్యాంగ్ స్టర్ గా వింటేజ్ పవన్ కళ్యాణ్ ను చూస్తారని యూనిట్ నమ్మకంగా చెప్తోంది. హై లెవల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఫీస్ట్ ఫర్ ఫ్యాన్స్ అని టాక్ నడుస్తోంది.