కన్నడ స్టార్ హీరోలలో రిషబ్ శెట్టి ఒకరు. కాంతారా సినిమాతో రిషబ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారాడు రిషబ్ శెట్టి. కెజిఎఫ్ నిర్మించిన హోంబాలే నిర్మాణంలో వచ్చిన కాంతారాను రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా చేసాడు. విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత కన్నడ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రిక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి.
Also Read : Allu Arjun : పుష్ప- 2 స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్..?
మరోవైపు రిషబ్ శెట్టికి ఇతర భాషలు నుండి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ రిషబ్ శెట్టి ఆచి తూచి సినిమాలు ఒకే చేస్తున్నాడు. తాజాగా రిషబ్ తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే జై హనుమాన్ ఒకటి. తేజ సజ్జ హీరోగా వస్తున్న ఈ సినెమాలో కీలకమైన హనుమంతుని పాత్రలో రిషబ్ శెట్టి కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్ లో అడుగుపెట్టనున్నారు రిషబ్ శెట్టి. ఈ సినిమాతో పాటు మరో స్ట్రయిట్ తెలుగు సినిమాకు ఈ కన్నడ నటుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న సితార ఎంటర్టైనమెంట్స్ సంస్థ రిషబ్ శెట్టి తో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే రిషబ్ కు తెలుగులో మంచి మార్కెట్ రావడమే కాకుండా ఒక కన్నడ నటుడు హీరోగా తెలుగులో నటించిన హీరోగా రిషబ్ శెట్టి రికార్డు క్రియేట్ చేసినట్టే