మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయింది.
Also Read : UnstoppableS4 : పుష్పరాజ్ తో అఖండ ‘అన్ స్టాపబుల్ ఫైర్’
కాగా ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ అందుకుంది. దుల్కర్ నటన, వెంకీ అట్లూరి దర్శకత్వం ఆడియెన్స్ ను అలరించింది. బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ సినిమా విడుదలైన 10 రోజులకు గాను 88. 7 కోట్లు సాధించింది. అందుకు గాను అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. నిన్న శనివారం చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. అటు తమిళ్ లో లక్కీ భాస్కర్ ఊహించినదానికంటే ఎక్కువగా కలెక్ట్ చేస్తోంది. ఇప్పటికి రూ. 11కోట్లకు పైగా రాబట్టి బయ్యర్స్ కు లాభాలు తెచ్చి పెట్టింది. ఇప్పటికి రిలిజ్ అయిన అన్ని ఎరియాస్ లో స్టడీగా వసూళ్లు ఉన్నాయి. ఈ సినిమా విజయంతో దుల్కర్ హ్యాట్రిక్ కఅందుకున్నాడు. లాంగ్ రన్ లో లక్కీ భాస్కర్ రూ. 100 కోట్ల మార్కెట్ ను దాటేస్తుంది లక్కీ భాస్కర్.