తెలుగు రాష్టాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. మరోవైపు విజయవాడ, ఖమ్మం వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారంలో రిలీజ్ కావాల్సిన సినిమాల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థులలో సినిమాలు రిలీజ్ చేస్తే ఆడియెన్స్ థియేటర్స్ కి వస్తారా రారా అని సందిగ్థత నెలకొంది. అందుచేత కొన్ని సినిమాలు అనుకున్న డేట్ కు రిలీజ్ అవుతుండగా కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి.
Also Read: Tollywood : వరద భాదితులకు అండగా టాలీవుడ్.. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే..?
గత వారం రిలీజ్ అయిన నాని నటించిన సరిపోదా శనివారం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఒకవైపు వర్షాలు కురుస్తున్న మంచి కలెక్షన్స్ రాబట్టింది సరిపోదా శనివారం. ఆ భరోసాతో నివేతా థామస్ నటించిన 35 చిన్న కథ కాదు అనే చిన్న సినిమా ఈ సెప్టెంబరు 6న రిలీజ్ అవుతోంది. అదే దారిలో దిల్ రాజు నిర్మించిన యంగ్ హీరో సుహాస్ నటించిన జనక అయితే గనక అనే చిన్న మొదట సెప్టెంబరు 7 రిలీజ్ కావాల్సి ఉండగా ఇప్పడు వర్షాల కారణంగా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమా కంటెంట్ పై నమ్మకంతో చిత్ర హీరో సుహాస్ ఓవర్సీస్ రైట్స్ కొనుగోలు చేసాడు. మరోవైపు జనక అయితే గనక స్పెషల్ ప్రీమియర్స్ సెప్టెంబరు 6న వేసేలా అన్ని ఏర్పాట్లు చేసారు మరి ఇప్పుడు ప్రీమియర్స్కూడా క్యాన్సిల్ చేస్తారో లేదా అవి కూడా వాయిదా వేస్తారో క్లారిటీ రాలేదు.