Site icon NTV Telugu

Dil Raju: గేమ్ చేంజర్ విషయంలో ఏం చేయలేక పోయాను!

Dil Raju

Dil Raju

గేమ్ చేంజర్ విషయంలో తనకు రిగ్రెట్స్ ఉన్నాయని దిల్ రాజు వెల్లడించారు. దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. అయితే, ఆ సంగతి పక్కనపెడితే, ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Also Read:Sajjala Ramakrishna Reddy: ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది..!

రామ్ చరణ్ RRR తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్‌తో గేమ్ చేంజర్ సినిమాతో వచ్చారు, కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ విషయంలో రిగ్రెట్స్ ఉన్నాయా అంటే, 100% రిగ్రెట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో నేను ఎక్కువగా ఫీల్ అవుతాను, ఎమోషనల్‌గా కూడా ఫీల్ అవుతాను, కానీ ఈ విషయంలో నా చేతుల్లో ఏమీ లేదని అన్నారు.

Also Read:Tejeshwar Murder Case: తేజేశ్వర్ హత్య కేసు.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు.. హత్యకు కారణం అదే!

అయితే, నిజానికి సినిమా విషయంలో శంకర్ దిల్ రాజుని ఎడిట్ రూమ్‌కి సైతం రానివ్వలేదని అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పుడు దిల్ రాజు మాటలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. మొత్తం మీద, గేమ్ చేంజర్ విషయంలో తాను అసంతృప్తిగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.

Exit mobile version