మలయాళ భామ అనంతిక హీరోయిన్ గా 8 వసంతాలు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది, అయితే ఈ సినిమాలో హీరోయిన్ తో ఒక ఫైట్ ప్లాన్ చేశారు అది కూడా కాశీ కబేళాలో ప్లాన్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఈ విషయాన్ని నేరుగా ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో టీంను ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది.
Also Read:బికినీ వేసి బీచ్‌లో కాజల్ హల్చల్
నిజానికి ఈ సినిమాకి మిక్స్ రివ్యూస్ వచ్చాయి కొంతమంది బాగుందంటే కొంతమంది మాత్రం అసలు ఏమాత్రం బాలేదని అంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సక్సెస్ మీట్ నిర్వహించడంతో సీనియర్ జర్నలిస్టు ఒకరు క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ లో భాగంగా తనకు ఈ సినిమాలో అభ్యంతరాలు ఉన్నాయని వెల్లడించారు. కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో ఒక బ్రాహ్మణుడి పాత్రతో అమ్మాయిని రేప్ చేయించే ప్రయత్నం చేయడం అది కూడా ఒక కబేళాలో చేయించడం ఆ ఆలోచన అభ్యంతరకరమని అన్నారు.
Also Read:కొబ్బరి బొండంతో అందాలను ప్రదర్శించిన రమ్య పసుపులేటి..
అంతేకాదు ఆ కబేళాలో రేప్ చేయడానికి వెళ్ళిన సమయంలో ఆ బ్రాహ్మణ వ్యక్తికి కొంతమంది ముస్లింలు సహాయపడినట్లు చూపించారు. ఈ మైండ్ సెట్ ఏంటి? ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇక సినిమా దర్శకుడు ప్రెస్ మీట్ కి హాజరు కాకపోవడంతో సినిమా టీం లో వేరే వ్యక్తులు ఈ విషయాన్ని కాస్త కవర్ చేసే ప్రయత్నం చేసినా సినిమా తీసిన దర్శకుడు ఇక్కడ లేరు కాబట్టి ఆ ఉద్దేశం ఏంటో తాము చెప్పలేమని వారు వెల్లడించారు. దర్శకుడు చెప్పిన విధంగా చేయడమే నటుల లక్షణం కాబట్టి తమకు ఏమీ తెలియదని చెప్పుకొచ్చారు.