దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవనం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వివిధ రంగాల్లో విధులు నిర్వహిస్తున్న తెలుగు వారి కోసం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు ప్రదర్శిస్తున్నారు. ఈ పాన్-ఇండియా చిత్రం జూలై 24, 2025న విడుదలై, భారీ ఓపెనింగ్స్‌తో పాటు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలను అందుకుంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు…
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. క్రిష్ దర్శకుడిగా మొదలుపెట్టిన ఈ సినిమాని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ఎ.ఎం. రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. Also Read:Podcast With NTV: ‘గీతా’ గాన గంధర్వ డాII ఎల్. వి. గంగాధర శాస్త్రితో అలాగే ఈ…
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో కింగ్డమ్ అనే టైటిల్‌తోనే రిలీజ్ కాబోతోంది, కానీ హిందీలో మాత్రం ఈ టైటిల్ దొరకలేదు. అందుకే హిందీ వెర్షన్‌కి సామ్రాజ్య అనే టైటిల్ ఫైనల్ చేశారు మేకర్స్. ఈ రెండు పదాలూ దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తాయి. కింగ్డమ్ అంటే రాజ్యం, ఒక రాజు పాలించే భూభాగం. ఇది ఇంగ్లీష్ పదం, అందుకే…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 24న (జులై 24, 2025) విడుదల కానున్న ఈ సినిమా పట్ల అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాతలు మొదటి రెండు వారాల పాటు టికెట్ రేట్ల పెంపు కోరగా, ప్రభుత్వం మొదటి పది రోజులకు మాత్రమే…
“ది 100″ సినిమాతో ఇటీవల ఓ బాధ్యతాయుతమైన పోలీస్ డ్రామాను తెరకెక్కించి తన మొదటి చిత్రంతోనే దర్శకుడిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు రాఘవ్ ఓంకార్ శశిధర్. జూలై 11న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు వస్తున్న ఆదరణపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ…”ఈ సినిమా కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు. భావోద్వేగం, బాధ్యత, నీతితో కూడిన కథ. ఇందులో నిజాయితీ గల పోలీస్ అధికారి బాధ్యత,…
పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న…
ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.…
భారతీయ సినిమా రంగంలో పాన్-ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేసిన హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి సరికొత్త యానిమేటెడ్ ఫ్రాంచైజీ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ (MCU)ని ప్రారంభించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి చిత్రం ‘మహావతార్ నరసింహ’ 2025 జూలై 25న ఐదు భారతీయ భాషలలో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) అత్యాధునిక 3D ఫార్మాట్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల…
‘టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు,’ మనీ రైన్ కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకుల్లోకి చొచ్చుకుని పోయింది అని వర్జిన్ బాయ్స్ నిర్మాత రాజా దారపునేని అన్నారు. . అభిమానులు, ప్రేక్షకుల నుంచి స్పందన అద్భుతంగా ఉంది. దీంతో సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఎక్కడ చూసిన వర్జిన్ బాయ్స్ గురించి చర్చ నడుస్తోందన్న ఆయన ఇది మా టీమ్ అందరిలో నూతన ఉత్సాహాన్ని పెంచిందన్నారు. దయానంద్ రచనా దర్శకత్వంలో రాజ్ గురు బ్యానర్ పై రాజా దారపునేని నిర్మించిన…
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రతిష్టాత్మకమైన, సెన్సేషనల్ వెంచర్ – మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) కోసం కలిసి సినిమా చేస్తున్నారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణు దశ అవతారాల పురాణ గాథను తెరమీదకు తీసుకురానుంది. అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌లో ఇంతకు ముందు ఎన్నడూ ప్రయత్నించని సినిమాటిక్ స్కేల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు. దర్శకుడు అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధావన్,…