Dil Raju Comments about Eagle Movie Solo Release: సంక్రాంతి సినిమాల పోటీ నుంచి తప్పుకుంటే, తప్పుకున్న సినిమాకి సోలో రిలీజ్ ఇస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా టీం తమ సినిమాను వాయిదా వేసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఫిబ్రవరి 9న ఏ సినిమా రావడం లేదని భావించి ఆ డేట్ ఈగల్ సినిమాకి ఇచ్చింది. అయితే నిజానికి అంతకంటే ముందే సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఊరి పేరు భైరవకోన సినిమా అదే డేట్ కి రిలీజ్ అనౌన్స్ చేశారు. ఒకరోజు ముందు అంటే ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 రిలీజ్ కూడా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ తెలుగు ఫిలిం ఛాంబర్ వీరితో సంప్రదింపులు జరపకుండా ఈగల్ టీంకి సోలో రిలీజ్ డేట్ చేసింది.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిందిగా ఈగల్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక లేఖ రాయడంతో రంగంలోకి దిగిన ఫిలిం ఛాంబర్ ఎట్టకేలకు సినిమాలను వాయిదా వేసుకోవాల్సిందిగా ఊరు పేరు భైరవకోన, యాత్ర 2, తమిళ్ లాల్ సలాం యూనిట్స్ ని కోరింది.
Pushpa’s Rule: మరో 200 రోజుల్లో పుష్ప గాడి రూలింగ్
అయితే యాత్ర 2 సినిమాని వాయిదా వేసుకోవడం కుదరదని మేకర్స్ తేల్చి చెప్పారు. కానీ ఊరి పేరు భైరవకోన సినిమా యూనిట్ మాత్రం ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవించి వారం రోజులు వెనక్కి వెళ్లి ఫిబ్రవరి 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నట్లు ఛాంబర్ ప్రెస్ మీట్ లో ప్రకటించింది. రజనీకాంత్ లాల్ సలాం టీం ని కూడా వాయిదా వేసుకోవాల్సిందిగా కొడితే తమ సినిమా తమిళ్ రిలీజ్ కూడా ఉంది కాబట్టి వాయిదా వేసుకోలేమని వారు కూడా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఈ విషయం అర్థం చేసుకున్నారని ఈగల్ సినిమా వాళ్లకి ఎక్కువ స్క్రీన్స్ వచ్చేలా ప్రయత్నిస్తామని దిల్ రాజు ప్రెస్ మీట్ లో ప్రకటించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే సమస్యలతో పాటు పరిష్కారాలు కూడా తెలియజేయమని వారే చెప్పారని ఎల్లుండి ఈసీ మీటింగ్ ఉంది, అందులో అమ్మని కలుపుకొని సమస్యలు ఏంటో తెలుసుకుని పరిష్కారాలు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. వచ్చే టర్మ్ కి తాను ప్రెసిడెంట్ గా ఉండే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇక ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని కలవబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు.